
బాలీవుడ్ విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కో-స్టార్ సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్నారు.
సందీప్ వయసు 33 ఏళ్లు. ఆయన ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌లో మరోసారి అలజడి రేగింది.
సందీప్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు.
తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ వీడియోలో తెలిపారు.
10 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో చాలా అంశాలను ప్రస్తావించారు. ఇటు వ్యక్తిగత జీవితంలో అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సందీప్ నహర్ తెలిపారు.
అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భార్య గురించి అనేక ఆరోపణలు చేసిన సందీప్.. తన మరణానికి ఆమె కారణం కాదని స్పష్టం చేశారు.
ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ నహర్ నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇంకా తేలకముందే… అదే సినిమాలో నటించిన మరో యాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.