
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు నిర్మిస్తున్న ఐదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణం నిమిత్తం భారీ విరాళాలు ఇచ్చారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎం.రత్నం,
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధిపతి ఎస్.రాధాకృష్ణ (చినబాబు),
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సహ వ్యవస్థాపకుడు నవీన్ యెర్నేని,
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధిపతి బండ్ల గణేష్ సంయుక్తంగా రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం నిర్మాణం నిమిత్తం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళం అందించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో ఆయన నిర్మాతలు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీకి చెక్కులు అందించారు.
పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజుతో “వకీల్ సాబ్” సినిమా, ఎ.ఎం.రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలోఓ సినిమా, మరోవైపు సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘అయ్యప్పనుం కోషియం’ రీమేక్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు పవన్.