25 మంది ప్రభావంతుల లిస్ట్ లో అల్లు అర్జున్… ఒకేఒక ఇండియన్ హీరో…!

587
Allu Arjun listed in GQ 25 Most Influential Young Indians of 2020

2020లో దేశంలో అత్యంత ప్రభావం చూపిన 25 మంది యువ డైనమిక్‌ వ్యక్తుల జాబితాలో అల్లు అర్జున్ స్థానం సంపాందించి అరుదైన రికార్డు సాధించారు. ఈ జాబితాను జీక్యూ ఇండియా మ్యాగజైన్ ప్రకటించింది.

25 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ ఆఫ్ 2020 జాబితా ఇదే…
1. జెహన్‌ దరువల
2. అభిషేక్‌ ముంజల్‌
3. డా. నందినీ వెల్‌హో
4. బైజు రవీంద్రన్‌
5. అనుష్క శర్మ, కర్నేశ్ శర్మ
6. ప్రణవ్‌ పై, సిద్ధార్థ్‌ పై
7. తరుణ్‌ మోహతా, స్వప్నిల్‌ మెహతా
8. లీజా మంగళ్‌దాస్‌
9. డానిష్‌ సైత్‌
10. బాల సర్దా
11. కె.ఎల్‌. రాహుల్‌
12. కునాల్‌ షా
13. మాధవ్‌ షెత్‌
14. డా. త్రినేత్ర హల్‌దార్‌ గుమ్మరాజు
15. చైతన్య తమ్హనే
16. అల్లు అర్జున్‌
17. అక్షయ్‌ నెహతా
18. వరుణ్‌ దేశ్‌పాండే
19. అనంద్‌ విర్మణి, అపరాజితా నినన్‌
20. క్రిషి ఫగ్వానీ
21. అపర్ణ పురోహిత్‌
22. మినమ్‌ అపాంగ్‌
23. అంబి, బిందు సుబ్రమణియమ్‌
24. డా. సూరజ్‌ యంగ్డే
25. రిషభ్‌ పంత్‌

ఈ జాబితాలో ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థానం సంపాదించారు. ఇండియన్ సినిమా నుంచి ఈ జాబితాకు ఎంపికైన ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. గతేడాది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకే 2020లో అల్లు అర్జున్‌ని జీక్యూ ఇండియా మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో స్థానం కల్పించి గౌరవించింది.

అలాగే, వినోద రంగం నుంచి బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మకు స్థానం దక్కింది. వీరు స్థాపించిన క్లీన్ స్లేట్ ఫిలింస్ సంస్థ గతేడాది నిర్మించిన డిజిటల్ మూవీస్ బుల్‌బుల్, పాటల్ లాగ్ విజయం సాధించాయి. ఒకవైపు గర్భిణిగా ఉన్న అనుష్క శర్మ.. మరోవైపు నిర్మాతగానూ రాణించడంతో ఆమెను ఈ జాబితాలో చేర్చింది జీక్యూ ఇండియా.