షర్మిల ఎవరి బాణం కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

214
Surabhi Vanidevi towards winning: Minister Srinivas Goud

వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. షర్మిల పార్టీతో తెలంగాణలో మార్పులు వస్తాయని తాను అనుకోవడంలేదని అన్నారు.

షర్మిల ఎవరి బాణం కాదని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఏం చేయలేకనే ఆమె ఇక్కడికి వచ్చారని చెప్పారు.

సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు తెలంగాణ ప్రజలు మద్దతు పలుకుతారని తాను భావించడంలేదన్నారు.

కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ స్థాపించినా తమకొచ్చిన నష్టమేమీ లేదని తెలిపారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్ ల పార్టీలు తెలంగాణలో ఏమయ్యాయో అందరికీ తెలిసిందేనని అన్నారు.