
నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి లాంగ్‌జంప్ పోటీల్లో తెలంగాణ విద్యార్థి తమ సత్తాచాటాడు.
స్థానిక రంగశాల స్టేడియంలో యూత్ గేమ్స్ ఇంటర్నేషనల్ గోల్డెన్ కప్- 2021 పోటీల్లో ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
ఈ పోటీల్లో తొలిస్థానం రష్యా క్రీడాకారుడికి దక్కింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి చెందిన కోమారి వెంకటేశ్ లాంగ్జంప్ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు.
కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన చంద్రయ్య, గోవిందమ్మ రెండో కుమారుడు వెంకటేశ్. నల్గొండలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.