సాగు చట్టాలపై పోరాడినట్లు టీఆర్ఎస్ డ్రామాలు ఆడింది: రేవంత్

236
TRS dramas played farming laws:Revanth

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్లు డ్రామాలు ఆడిందన్నారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ భయపడిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షా‌‌ను కలిసిన తర్వాత కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడని దుయ్యబట్టారు.

టీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నల్లచట్టాల వల్ల రైతులు బహుళ జాతీ కంపెనీ‌లకు బానిసలుగా మారుతారని మండిపడ్డారు.

పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. అదానీ, అంబానీల కోసమే నల్ల చట్టాలు తెచ్చారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

రైతులకు అన్యాయం జరిగితే కోర్టుకెళ్లే హక్కు కూడా లేకుండా చేశారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

నూతన వ్యవసాయ చట్టాల‌ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు.