ఫిబ్రవరి 15 న దియా మీర్జా పెళ్లి ???

250
Dia Mirza To Marry Vaibhav Rekhi On February 15

బాలీవుడ్ నటి దియా మీర్జా మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలిసింది. అంతేకాక ఈ మాజీ అందాల రాణి ఈ నెల 15 న ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో మూడుముళ్లు పడనున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.

కారణం ఏంటంటే “రెహానా హాయ్ తేరే దిల్ మే” నటి ఫిబ్రవరి 15 న చాలా సైలెంట్ గా వివాహం చేసుకోబోతున్నట్టు ఒక ప్రముఖ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ప్రచురించింది.

వారి ఆచారాలకు అనుగుణంగా అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి రెండు రోజులపాటు జరగనున్నట్టు, అతి తక్కువ స్నేహితులు హాజరు కానున్నట్టు ఆ పోర్టల్ ప్రకటించింది.

దియా మీర్జా గతంలో నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకున్నారు.

చాలా సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తరువాత, వారు అక్టోబర్ 2014 లో ఆత్మీయ వివాహం చేసుకున్నారు.

ఢిల్లీ లోని సాహిల్ యొక్క ఛత్తర్‌పూర్ ఫామ్‌హౌస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది.

దియా మీర్జా ఐదేళ్ల తర్వాత 2019 లో సాహిల్ సంఘతో విడిపోతున్నట్లు ఒక ప్రకటనలో ప్రకటించారు.

ఆమె అప్పుడు వారి బ్రేకప్ తెలియజేస్తూ “11 సంవత్సరాల మా వైవాహిక జీవితం తర్వాత మేము పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము.

మా దారులు వేరు. మేము స్నేహితులుగా వుంటూ గౌరవంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు.

ఆమె అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ ” నేను ఆటుపోట్లను ఎదుర్కోగలిగాను. ప్రస్తుతం సినిమాలతో బిజీ గా వున్నాను” అని అన్నారు.

దియా చివరిసారిగా తాప్సీ పన్నూ నటించిన ‘తప్పాడ్’ చిత్రం లో నటించింది. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే తెలుగు చిత్రం కోసం పనిచేస్తోంది.

కానీ దియా మీర్జా ఇప్పటి వరకు ఎటువంటి వివాహ ప్రకటన చేయలేదు.