షర్మిల పార్టీపై ఈటల సంచలన వ్యాఖ్యలు

354
Eetala sensational comments Sharmila's party

వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో షర్మిల పార్టీని టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్వాగతించడంలేదు.షర్మిల పార్టీతో తెలంగాణలో మార్పులు వస్తాయని తాను అనుకోవడంలేదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

వైఎస్సార్ అభిమానులను ఏకం చేయాలని షర్మిల ప్రయత్నిస్తుండడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

సెంటిమెంట్లు ఎక్కువకాలం పనిచేయవని అభిప్రాయపడ్డారు.అయినా కొత్తగా వచ్చేవాళ్లకు ఈ ప్రాంతంలో ఏం పని? అని ప్రశ్నించారు.

వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కాకుండా తెలంగాణలో ఆమె పార్టీ స్థాపించనుండడం ఆశ్చర్యం కలిగిస్తుంటే,

మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని అన్నారు. కానీ ఇక్కడ మనిషి గురించి ఆలోచించేవాళ్లకే ప్రజల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాల వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల పేర్కొన్నారు.