ప్రజల శ్రేయస్సే తమ పార్టీకి ప్రధాన లక్ష్యమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుబంధు పథకంతో రైతులందరూ లబ్ధిపొందుతున్నారని అన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నీటి సమస్యలు తొలగిపోయాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధిపేట పుట్టినిల్లు వంటిదని ఉద్యమంలో కాని, అభివృద్ధిలో కాని సిద్ధిపేటే నెంబర్ వన్ అని అన్నారు.
తెలంగాణ కోసం పదవులను వదులుకున్నామని చెప్పారు.ఎందరో త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించామని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.
బీజేపీపై హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ బాసులు ఢిల్లీలో ఉంటారని విమర్శించారు.