సంవత్సరం పాటు ఉచితంగా హెచ్‌డీ టీవీ ఛానెల్స్

537
one year hd channels free

వినియోగదారుల కోసం రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఆఫర్‌లో భాగంగా ఏడాది పాటు ఉచితంగా హెచ్‌డీ ఛానెళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా .. మార్చి 1 నుంచి తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెట్-టాప్ బాక్స్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. షెడ్యూల్ రికార్డింగ్, యూట్యూబ్ సపోర్ట్, యూఎస్‌బీ పోర్ట్ లాంటి పలు ఫీచర్లు ఈ సెట్‌టాప్ బాక్స్‌లో ఉండనున్నాయి.ఏడాదిపాటు ఉచితంగా హెచ్‌డీ ఛానెళ్లను ఆఫర్ చేయడమే కాకుండా మరో 500ల ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్‌ను ఐదేళ్లపాటు ఉచితంగానే వీక్షించే వెసులుబాటు ఇచ్చింది. కస్టమర్లు మార్చి 1 నుంచి రిలయన్స్ బిగ్ టీవీ హెచ్‌ఈవీసీ సెట్-టాప్ బాక్స్‌ను అఫీషియల్(Reliance Big TV website) వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని, అయితే ఇది స్టాక్ లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. బుకింగ్ సమయంలో కనెక్షన్ కోసం రూ.499 చెల్లించాలి వెల్లడించింది. మరోవైపు సెట్ టాప్ బాక్స్, అవుట్‌డోర్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులు రూ.1500 రుసుము చెల్లించాలనే విషయాన్ని వినియోగదారులు గమనించగలరని తెలిపింది.

ఒక ఏడాది సేవలు ముగిసిన తరువాత  రెండేళ్లపాటు ప్రతినెలా రూ.300లతో రీఛార్జి చేయాలని.. ఆ రెండేళ్లు పూర్తైయిన తరువాత బుకింగ్, ఇన్‌స్టాల్ చేసే సమయంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రిలయన్స్ వివరించింది. బుకింగ్ చేసిన 30 రోజల తరువాత డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది.