ఒక రాత్రికి రూ.కోటి ఆఫర్ చేస్తున్నారు ‘సెల్ఫీరాజా’ హీరోయిన్

452
sakshi - chowdary

పోటుగాడు, సెల్ఫీరాజా, జేమ్స్‌బాండ్ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాక్షి చౌదరి తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తనను రాత్రికి వస్తావా? అని అడుగుతున్నారని తెలిపింది.

ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు తనకు ఆఫర్ ఇస్తున్నారని.. మరికొందరు రాత్రికి వస్తావా? రేటెంత? అని వేధిస్తున్నారని పేర్కొంది. నటి అయినంత మాత్రాన చులకనగా చూడాల్సిన పనిలేదని, తనకు ఆఫర్ చేసేవారు పెద్ద మూర్ఖులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆఫర్లతో మరోసారి తన ముందుకొస్తే వారి బండారాన్ని బయటపెడతానంటూ సాక్షి హెచ్చరించింది