ఒప్పో నుంచి కె1 స్మార్ట్‌ఫోన్

341
K1samrt-phone

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె1 ను ఈ నెల 6వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు, ముందు భాగంలో 25 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. రూ.20వేల ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

ఒప్పో కె1 ఫీచ‌ర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

mobiles