గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్న టెన్నిస్ స్టార్‌

248
Rafael Nadal

మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ రఫేల్ నాద‌ల్ త‌న స్నేహితురాలు మేరీ పెరెల్లోను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమ‌ధ్య ఇద్ద‌రూ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను త‌న ఖాతాలో వేసుకున్న నాద‌ల్ మొత్తం 17 గ్రాండ్‌స్లామ్‌ల‌ను గెలుచుకున్నాడు.

దాదాపు 14 ఏళ్లుగా పెరెల్లోతో నాద‌ల్ డేటింగ్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏటీపీ టెన్నిస్ ఈవెంట్లు ముగిసిన త‌ర్వాత‌, బ‌హుశా అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో నాద‌ల్ వెడ్డింగ్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. నాద‌ల్ అకాడ‌మీలోనే పెరెల్లో ప‌నిచేస్తున్న‌ది.