హరీశ్‌ రావు రాజీనామా .. కారణం ఏమిటో తెలుసా

553
RTC TMU

సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఆర్టీసీ టీఎంయు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డికి పంపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా టీఎంయు నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్ టీఎంయు బాధ్యతలు స్వీకరించారు.
 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతరత్రా అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున, ఆర్టీసీ కార్మిక యూనియన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలోనే టీఎంయు బాధ్యతల నుంచి తప్పుకోవాలని హరీశ్ భావించారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి స్పష్టం చేశారు.