నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రాన్ని శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
క్యూట్ లవ్ స్టోరీ, హీరోయిన్ మేఘా ఆకాష్, నితిన్ మాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. ‘ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు, మీతో వచ్చిన ప్రాబ్లమ్ ఇదేనండి.. మీరే పట్టుకుంటారు.. మీరే వెళిపోమంటారు’ లాంటి డైలాగుల్లో త్రివిక్రమ్ స్టైల్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్టు అందించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నితిన్, మేఘా ఆకాష్‌తో పాటు డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.