యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ ‘చెక్’ సినిమా రూపొందింది.
ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.
కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్ గేమ్ టాలెంట్‌తో తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడు అనే ఆసక్తికర పాయింట్ తీసుకొని ఈ మూవీ రూపొందించారు. ఫిబ్రవరి 26న ఏ చిత్రం విడుదల కానుంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఈ ‘చెక్’ మూవీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి ఓపెన్ అయ్యారు.
తన కెరీర్‌లోనే ‘చెక్’ ఓ విభిన్న కథా చిత్రమని, 80 శాతం సినిమా జైలులోనే ఉంటుందని నితిన్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో తన పాత్ర కోసం మానసికంగా సిద్ధమయ్యానని.. ఆ కారణంగా ప్రతిరోజూ షూట్ అయిపోయాక అదే ఆలోచనలతో, విచారంగా ఉండేవాడిని అని చెప్పారు.
ఇది చూసి తన సతీమణి షాలినికి కూడా నాకు ఏమయ్యిందో అనే డౌట్ వచ్చేసిందని నితిన్ తెలిపారు.
ఇకపోతే రకుల్ ఓ కమర్షియల్ హీరోయిన్ అయినా కూడా పాటలు, రొమాన్స్‌కి స్కోప్ లేని ఈ సినిమాను వెంటనే ఓకే చేయడం చూసి షాకయ్యానని నితిన్ చెప్పుకొచ్చారు.
కాగా ఇటీవలే తన ప్రియురాలు కందుకూరి షాలిని మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడైన నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.