స్నానం చేసేందుకు వెళ్లి.. గోదావరిలో యువకుడు గల్లంతు

322
Going to bath young man lost in Godavari

స్నానం చేసేందుకు వెళ్లి గోదావరి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్ర స్నానఘట్టాల వద్ద జరిగింది.

మణుగూర్‌కు చెందిన మోతుకూరి సురేశ్‌ అనే యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వచ్చాడు. అందరూ స్నానం చేసేందుకు స్నాన ఘట్టాల వద్ద నదిలో దిగారు.

నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో సురేశ్‌తోపాటు మరో ఇద్దరు నదిలో గల్లంతయ్యారు. స్థానికులు అతికష్టం మీద ఇద్దరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.

నీటి ఉధృతి అధికంగా ఉండడంతో సురేశ్‌ను మాత్రం కాపాడలేకపోయారు. గల్లంతైన యువకుడి కోసం అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో దైవదర్శనానికి వచ్చిన కుటుంభం శోక సంద్రంలో మునిగిపోయింది.