తల్లి అయిన కాజల్ చెల్లి

530
nisha-agarwal-blessed-baby-boy

అందాల తార కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్‌ తల్లిగా ప్రమోషన్ అందుకుంది. బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని కాజల్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నిషా తనకు పుట్టిన బిడ్డను ముద్దాడుతున్న ఫొటోను కాజల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోకు.. ‘నిషా ప్రసవించే సమయంలో పుట్టబోయే బిడ్డ కోసం రాత్రంతా మేల్కొని ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదిగో మా చిన్నారి ఇషాన్‌ను చూశారా?’ అని కాజల్ ట్వీట్ చేశారు.

2013 డిసెంబర్ 28న నిషా అగర్వాల్.. ముంబై బిజినెస్‌మెన్ కరణ్ వలేచాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల తరువాత నిషా మగ బిడ్డకు జన్మనివ్వగా.. బాబుకు ‘ఇషాన్ వలేచా’ అని నామకరణం చేశారు.

నిషా అగర్వాల్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించగా, ఏమైంది ఈవేళ, ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి తెలుగు చిత్రాల్లో నిషా నటించారు. కరణ్‌తో వివాహమయ్యాక నిషా సినిమాలకు దూరమయ్యారు. నిషా గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త కరణ్‌తో కలిసి దిగిన ఫొటోతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.