నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైల‌ర్ విడుద‌ల

342
gangleader trailer

జెర్సీ చిత్రం త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్‌లో స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్ , సాంగ్, టీజ‌ర్ అంటూ చిత్రానికి సంబంధించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చిన టీం తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. స‌రికొత్త క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్‌ని చూస్తే అర్ధ‌మవుతుంది.

పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డిని ట్రైల‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మైంది. కార్తికేయ విల‌న్‌గా అద‌రగొట్టాడు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించి విడుద‌లైన‌ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు .