నాని‘గ్యాంగ్‌లీడర్‌’ టీజర్‌

255
Gang leader teaser

నేచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్’. ఈ సినిమా టీజర్‌ను నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ.. ‘నా గ్యాంగ్, విక్రమ్‌ కథ, అనిరుధ్‌ సౌండ్‌, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘నా పేరు పెన్సిల్‌. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌’ అంటూ నాని చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో తమ పగ తీర్చుకుంటూ ఉంటారు. టీజర్‌ చివర్లో నాని స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుని ‘మీరూ పెట్టుకోండి’ అని తన గ్యాంగ్‌ను అడుగుతాడు. ఇందుకు వారు ‘మేం తీసుకురాలేదు. ఇంట్లోనే పెట్టేశాం’ అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.