28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ- నాగ్ కాంబినేషన్ తాజాగా ఆఫీసర్ చిత్రంతో మరో అద్భుతం క్రియేట్ చేయనున్నారని తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా ఆఫీసర్ చిత్రం తెరకెక్కగా, మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలని చూస్తుంటే వర్మ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కిడ్నాప్ అయిన పాపని రక్షించే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్టు సమాచారం.. చిత్ర షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగినట్టు తెలుస్తుంది. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. కంపెనీ బేనర్‌పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.