యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “నాంది”. విజయ్ కనకమేడల “నాంది” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై “నాంది” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా “నాంది” చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 19న “నాంది” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా కనిపిస్తున్నాడు. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ లేక సతమవుతున్న అల్లరి నరేష్ ఇప్పుడు ఈ ప్రయోగాత్మకమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నరేష్ ఇప్పటికే హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
అల్లరి నరేష్ చివరగా నటించిన చిత్రం “బంగారు బుల్లోడు”. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. “నాంది” సినిమాతో అల్లరి నరేష్ మంచి బ్రేక్ రావాలని కోరుకుందాం.