ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదు: నిమ్మగడ్డపై రోజా విమర్శలు

89

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు.  ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని ఆమె అన్నారు. ఏకగ్రీవాలను ఆపటం ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు.

ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఎన్నికల కమిషన్‌ కోరింది. ఈ నేపథ్యంలో రోజా స్పందింస్తూ తీవ్రవ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డకు చిన్నమెదడు చితికిపోయినట్టుందని ఎద్దేవా చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌ కోరింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు.