సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి ఫేం పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కాలా. మురికివాడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేసింది టీం. ఇందులో రజనీ డైలాగ్స్ ప్రేక్షకులకి పూనకం వచ్చేలా చేశాయి. విడుదలైన కొన్ని గంటలలోనే కోటి ఇరవై లక్షల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది చిత్ర టీజర్. ఇప్పుడు ఈ టీజర్‌కి క్రికెటర్స్ కూడా ఫిదా అయ్యారు.
మరి కొద్ది రోజులలో మొదలు కానున్న ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాలా టీజర్‌లోని డైలాగ్స్ తో ఓ ప్రోమో చేశారు. ఇందులో బజ్జీ కాలా.. అదేం పేర్రా అంటాడు. విజయ్ కాలా అంటే కరికాలుడు, చావుకే దడ పుట్టించేవాడు అని చెబుతాడు. ఆ తర్వాత వెస్టీండిస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కాలా అంటే కాపాడే వాడు.. అని డైలాగ్ విసురుతాడు. ఇక చివరిగా చెన్నై కెప్టెన్ ధోని ‘ఏం రా సెట్టింగా’ అంటూ రజనీ స్టైల్‌లో డైలాగ్ చెప్తాడు. చివర్లో మళ్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడు చూళ్లేదు కదూ… ఇప్పుడు చూపిస్తా అని విలన్లను రఫ్పాడిస్తాడు. మొత్తానికి ఈ టీజర్ ఇటు సినిమా ప్రేక్షకులనే కాక క్రికెట్ లవర్స్‌ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు దీనిపై ఓ లుక్కేయండి.