మెగాస్టార్‌ ‘సైరా’ టీజర్‌ విడుదల

291

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా టీజర్‌ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌కు వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు.

ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్నిఎంతగానో ఆకట్టుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.