ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 20 ఆగస్టు 2019

289
today rashi phalalu

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళ పక్షం పంచమి: రా.1-28 తదుపరి షష్టి రేవతి నక్షత్రం: రా.8-01 తదుపరి అశ్విని అమృత ఘడియలు: సా.5-23 నుంచి 7-08 వరకు వర్జ్యం: ఉ.6-53 నుంచి 8-38 వరకు దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-07 వరకు తిరిగి రాత్రి 10-54 నుంచి 11-40 వరకు రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5-46; సూర్యాస్తమయం: సా.6.20

మేష రాశి : అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. అనుకోని లాభం కాని, బహుమతి కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల కారణంగా దాని నుంచి బయటపడ గలుగుతారు.

వృషభ రాశి : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

మిథున రాశి : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాత మిత్రులను కలవడం జరుగుతుంది. ఆర్థికంగా లాభిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనయ్యి అనవసర వివాదాల్లో తలదూర్చకండి.

కర్కాటక రాశి : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

సింహ రాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మానసికంగా ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. ఏ పని కూడా ఉత్సాహంగా చేయలేరు.

కన్య రాశి : మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవటం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

తుల రాశి : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యదినం. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. నూతన ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శతృవులపై లేదా ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు.

ధనుస్సు రాశి : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధననష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

మకర రాశి : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

కుంభ రాశి : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

మీన రాశి : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.