ఆటోమోటివ్ రంగంలో భారీ కార్లకు పెట్టింది పేరు టయోటా. ఈ నెల చివరి వరకు దాదాపు అన్ని మోడల్స్‌పై సంస్థ 1.90లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది. ముఖ్యంగా ఇటియోస్, యారీస్, ఆల్టిస్, ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చునర్ మోడల్స్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ కొనసాగనుంది.
కొన్ని నెలల నుంచి కార్ల అమ్మకాలు మందగించడంతో ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి కార్ల యాజమాన్య సంస్థలు. ఇందులో భాగంగా ఎక్సేంజి బోనస్, కార్పోరేట్ బోనస్, లాయాల్టీ బోనస్‌ల పేరుతో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫార్చునర్ కార్లపై ఒక లక్ష వరకు ఎక్సేంజ్ బోనస్ లభించనుంది.