
‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల. హ్యాట్రిక్ విజయం కోసం.. తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్టు’ సినిమాను తెరకెక్కించారు. రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం ద్వారా మాళవికా శర్మ కథానాయికగా పరిచయమవుతోంది. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.