అడివి శేష్ చేతుల మీదుగా ‘మరణం’ ఫస్ట్ లుక్ విడుదల

135
Maranam Movie First Look Released by Adivi Shesh

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో, వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) అనేది ఉప శీర్షిక.

తాజాగా “మరణం” సినిమా ఫస్ట్ లుక్ ను యంగ్ హీరో అడివి శేష్ విడుదల చేసారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ “మరణం ఫస్ట్ లుక్ పోస్టర్ భయపెడుతుంది. పోస్టర్ తో పాటు టీజర్ కూడా బాగుంది. మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. హీరో, దర్శకుడు వీర్ కి హీరోయిన్ శ్రీ రాపాకకి నా శుభాకాంక్షలు. “మరణం” చిత్రం థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాదించాలి” అని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో, దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ “మరణం సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది” అని తెలిపారు.

హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ “మరణం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ చేవూరి, చిత్ర నటి మాధురి మరియు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.