పిచ్చి ప్రేమలో మలైకా

197
arjun kapoor birthday tweet

సినిమాలతో కన్నా ఎఫైర్‌ విషయంతోనే ఎక్కువగా వార్తల్లో కనిపించే బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ అర్జున్‌ కపూర్‌, మలైకా ఆరోరా భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కొద్ది రోజుల ముందు నుంచే అర్జున్‌తో ప్రేమ వ్వవహరం నడిపిందన్న టాక్‌ ఉంది. భర్త అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట బహిరంగంగా ఈవెంట్స్‌లో రెస్టారెంట్స్‌లో కనిపిస్తున్నప్పటికీ ప్రేమ వ్వవహరం మాత్రం రహస్యంగానే ఉంచారు. ఇన్నాళ్ల తరువాత మలైకా తన రహస్య బంధానికి తెర లేపి అర్జన్‌ కపూర్‌తో ప్రేమ వ్వవహరాన్ని బయట పెట్టారు.

అర్జున్‌ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోస్‌ను పోస్ట్‌ చేసి.. ‘హ్యాపీ బర్త్‌ డే మై పిచ్చి, అల్లరి అర్జున్‌’ అంటూ కామెంట్ చేశారు. ఈ జంట ఇప్పుడు న్యూయార్క్‌లో సందడి చేస్తున్నారు. అక్కడి సరదాగా గడుపుతున్న ఫోటోలను షేర్‌ చేస్తూ, ‘ఇప్పుడు మా బంధాన్ని బహిరంగంగా ఉంచాలనుకుంటున్నాం. మా మధ్య బంధాన్నిఅందరు గౌరవించాలనుకుంటున్నామని’ తెలిపినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది.