నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్న వింత వీడియో

219

ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు నెత్తి గోక్కుంటున్నారు. ఆ వీడియోలో ఉన్నది ఏంటో సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. అది చూస్తే కాకిలా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే గొరిల్లాలా ఉంది. పరీక్షించి చేస్తే కాకిలా ఉంది. ఈ వీడియోను జపాన్‌లోని నగోయాలో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియోను చూసి నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అది ఏదో తెలియక.. దానికి కొత్త పేరు పెట్టారు. గొరిల్లా క్రౌ అని దానికి పేరు పెట్టారు. అది చూడటానికి గొరిల్లాలా ఉందని.. ఆ పేరు పెట్టారు. ఆ వీడియోను తీసిన వ్యక్తి కూడా దాన్ని ముందు జాంబీ అనుకున్నాడట. తర్వాత దాన్ని అలాగే చూసి కాకిగా ఫిక్స్ అయ్యాడట. అయితే.. జపాన్‌లో పెద్ద పెద్ద కాకులు ఉంటాయట. ఈ కాకి కూడా ఆ జాతికి చెందిందే అయి ఉంటుందని అనుకుంటున్నారు.

ఇక.. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. తమకు నచ్చిన కామెంట్లు పెట్టారు. వామ్మో.. ఫస్ట్ దాన్ని చూసి గొరిల్లా అనుకున్నా.. కానీ.. అది కాకి అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఆ వీడియోను చూసిన వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చర్ స్విఫ్ట్.. దాని ప్రవర్తన గురించి ట్వీట్లు చేశారు.