రాశి ఫలాలు – శుక్రవారం 28 జూన్ 2019

180
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేష రాశి : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృషభ రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మిథున రాశి : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

కర్కాటక రాశి : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంస కానీ పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు.

సింహ రాశి : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

కన్య రాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

తుల రాశి : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్తారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

వృశ్చిక రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన పాత బకాయిలు రావటం కాని, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కోసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

మకర రాశి : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనటం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. ఇట్లో విశ్రాంతిగా ఉండటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో మంచి ప్రగతి సాధిస్తారు. ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కుంభ రాశి : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోని మార్పు కానీ ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు.

మీన రాశి : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాద వివాదాలకు తావివ్వకండి. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశముంటుంది.