మహర్షి టీజర్ విడుదల – మహేష్ డైలాగ్ కేక

408
maheshbabu maharshi teaser

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. మహర్షి చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఉగాది కానుకగా మహర్షి టీజర్ విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే కొద్దిసేపటి క్రితమే మహర్షి టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో వంశీ పైడిపల్లి మహేష్ బాబుని స్టైలిష్ గా చూపించడం పై దృష్టి పెట్టినట్లుఉన్నాడు.

ఉగాది పండగ కానుకగా

మహేష్ అభిమానుల నిరాశని తొలగించేలా తాజాగా మహర్షి టీజర్ విడుదలయింది. బృందావనం, ఎవడు, ఊపిరి లాంటి సక్సెస్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనితో మహేష్, వంశీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహర్షితో రిషిగా మహేష్ ని తాను ఎలా చూపించబోతున్నానో టీజర్ ద్వారా వంశీ శాంపిల్ చూపించాడు.

రిచ్ విజువల్స్

ఇక టీజర్ లోని విశేషాలు గమనిస్తే.. టీజర్ ప్రారంభం కాగానే మహేష్ బాబు హెలికాఫ్టర్ లో నుంచి ఎంట్రీ ఇస్తాడు. టీజర్ లోని విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మహేష్ బాబు సూటు, బూటు, గాగుల్స్ ధరించి ఎప్పటిలాగే స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్లేనా అంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది.

ఓడిపోతాను అంటే గెలిచి చూపిస్తా

టీజర్ లో మరో ఆకర్షణగా నిలిచిన అంశం మహేష్ బాబు డైలాగ్స్. ‘సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయి.. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ’ అంటూ మహేష్ చెబుతున్న డైలాగ్స్ బావున్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు ట్రేడ్ మార్క్ రన్నింగ్ స్టైల్ ని చూపిస్తారు. ఇక టీజర్ చివర్లో మహేష్ విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అభిమానులు కేక పెట్టే విధంగా ఉంది. ‘నాకో ప్రాబ్లమ్ ఉంది సర్.. ఎవడైనా నువ్వు ఓడిపోతావు అంటే గెలిచి చూపించడం అలవాటు’ అంటూ మహేష్ వార్నింగ్ ఇస్తాడు. మాస్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా బాగా డిజైన్ చేసినట్లు ఉన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

మహెష్ బాబు స్టైలిష్ లుక్, టీజర్ లో కనిపిస్తున్న విజువల్స్ కు తగ్గట్లుగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి బ్యాగ్రౌండ్ సంగీతాన్ని అందించాడు. మొత్తంగా మహర్షి టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.