శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం; వసంత రుతువు; చైత్ర మాసం; శుక్ల పక్షం; చైత్రశుక్ల పాఢ్యమి: మ.2.42 తదుపరి విదియ; రేవతి నక్షత్రం: ఉ.6.58 తదుపరి అశ్విని; అమృత ఘడియలు: ఉ. 6.06 వరకు, పునరమృతం రా. 12.40 నుంచి 2.21 వరకు; వర్జ్యం: తె. 4.02 నుంచి 5.43 వరకు; దుర్ముహూర్తం: ఉ. 5.55 నుంచి 7.33 వరకు; రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు; సూర్యోదయం: ఉ.5-55; సూర్యాస్తమయం: సా.6.10; ఉగాది, చంద్రదర్శనము
మేషరాశి : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన దుస్తులు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృషభరాశి : ఈ రోజు కొంత బద్ధకంగాఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్యకారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.
మిథునరాశి : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాలు ఓ కొలిక్కివస్తాయి.
కర్కాటకరాశి : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండాపనిచేస్తే విజయం సాధిస్తారు.
సింహరాశి : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.
కన్యరాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయంకానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజుకాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకుకారణం కావచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
తులరాశి : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూలదినం. మీ మనసులోని భావాలను మీ జీవిత భాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితోకలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.
వృశ్చికరాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సురాశి : ఈ రోజు ప్రేమను లేదా మీఅభిప్రాయాన్ని వ్యక్తపర్చడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీసంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తఅవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైనరోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరరాశి : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనడం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కివస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో మంచి ప్రగతి సాధిస్తారు.
కుంభరాశి : ఈ రోజు మీవృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోనిమార్పు కానీ ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజుఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. కొత్తబట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ భావోద్యేగాలను, అత్యుత్సాహాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది.
మీనరాశి : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించిఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాదవివాదాలకు తావివ్వకండి. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.