శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం ఏకాదశి: ఉ. 6.16 తదుపరి ద్వాదశి ధనిష్ఠ నక్షత్రం: రా. 9.57 తదుపరి శతభిషం అమృత ఘడియలు: ఉ. 10.25 నుంచి 12.11 వరకు వర్జ్యం: తె. 5.55 నుంచి దుర్ముహూర్తం: మ. 12.28 నుంచి 1.17 వరకు తిరిగి మ.2.54 నుంచి 3.43 వరకు రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు సూర్యోదయం: ఉ.5-59; సూర్యాస్తమయం: సా.6.09
మేషరాశి : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. పుకార్లను. చెప్పుడు మాటలను పట్టించుకోకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
వృషభరాశి : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఓ కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
మిథునరాశి : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం.
కర్కాటకరాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
సింహరాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూల దినం.
కన్యరాశి : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు/ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడుతాయి.
తులరాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.
వృశ్చికరాశి : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.
ధనుస్సురాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మకరరాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కుంభరాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీనరాశి : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయటం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.