సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “లైగర్”.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ‘లైగర్’ టీమ్ పార్టీ చేసుకుంది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి, బాలీవుడ్ భామలు కియార అద్వానీ, సారా అలీ ఖాన్ హాజరయ్యారు.
ఆ చిల్ అవుట్ ఫొటోలను ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
View this post on Instagram
నిజానికి ‘లైగర్’ సినిమాలో సారానే హీరోయిన్‌గా నటించాల్సింది. అయితే సారా డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్ల ఆ ఛాన్స్ అనన్య దక్కించుకుంది.
ఇక కియార, విజయ్ కలిసి ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా బాక్సింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.
‘లైగర్’ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.