
లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కలిసి నిర్మించిన ఓ తమిళ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో (ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా “కూజంగల్” అనే చిత్రం “టైగర్ అవార్డు” దక్కించుకుంది.
చిత్రానికి టైగర్ అవార్డ్ దక్కడంతో క్యూట్ కపుల్ నయన్,విఘ్నేష్‌లు కలిసి నెదర్లాండ్స్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌ఆర్ కార్యక్రమంలో చిత్ర బృందంతో ఫొటోలు దిగారు.
ఈ చిత్రానికి పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించగా, నయనతార విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్‌పై నిర్మించారు.
తాగుబోతు తండ్రికి కొడుక్కు మధ్య జరిగే కథ నేపథ్యంలో “కూజంగల్” తెరకెక్కించారు. తమ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు వినోద్ రాజ్ మా కష్టానికి ఫలితం దక్కింది అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డ్ దక్కించుకున్న తొలి తమిళ చిత్రం “కూజంగల్” కావడం విశేషం. అంతేకాదు “టైగర్ అవార్డ్” దక్కించుకున్న రెండో ఇండియన్ చిత్రంగా “కూజంగల్” చరిత్ర సృష్టించింది.
మొదట 2017లో సనల్ కుమార్ ససిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం “సెక్సీ దుర్గా” ఈ అవార్డును సొంతం చేసుకుంది.