ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసిన పోర్న్ స్టార్

327
Mia Khalifa asks why Priyanka Chopra is silent on farmers protest

దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న ఓ అంశంపై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అడల్ట్ స్టార్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసింది.

“మిసెస్ జోనస్ ఏ క్షణంలోనైనా తన మౌనాన్ని వీడబోతున్నారా? నాకు చాలా ఆత్రుతగా ఉంది. బీరుట్ పేలుళ్ల సమయంలో షకీరా స్పందన కోసం నేను వేచి చూసినట్టే ఇప్పుడు అనిపిస్తోంది. నిశ్శబ్దం” అని మియా ఖలీఫా ట్వీట్‌ చేసింది.

లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభవించినప్పుడు పాప్ స్టార్ షకీరా స్పందించలేదట. అలాగే ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా మౌనంగా ఉన్నారని ఆమె ట్వీట్ అర్థం.

మియా కావాలనే ఇలా ప్రియాంకను టార్గెట్ చేయడంపై ప్రియాంక చోప్రా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అయితే మియాకు తెలియని విషయమేమంటే ఈ అంశంపై ప్రియాంక చోప్రా చాలా రోజుల క్రితమే స్పందించింది. గతేడాది డిసెంబర్‌లో రైతు ఉద్యమంపై ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.

“మన రైతులు భారత్‌కు ఆహారాన్ని అందించే సైనికులు. వారి భయాలను తొలగించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతోన్న ఒక ప్రజాస్వామ్యంగా మనమంతా ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలి” అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.

ఈ విషయంపై వెంటనే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్… ప్రియాంకను విమర్శించింది కూడా.