మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తన బ్రాండ్ ఐడెంటీటిని మార్చుకుంది.
మొన్నటి వరకు కింగ్స్ లెవెన్ పంజాబ్‌గా పిలువబడిన ఆ జట్టు ఇప్పటి నుంచి పంజాబ్ కింగ్స్‌గా పలువబడుతందని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది.
జట్టు లోగోను కూడా మార్చారు. ఈ లోగో పంజాబ్ స్ఫూర్తిని చాటి చెబుతుందని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. పంజాబ్ జట్టు ఐపీఎల్ ప్రారంభం నుంచి సత్తా చాటుతూ అనేక మంది అభిమానులను పంచుకుంది.
టోర్నీలో గట్టి పోటీ ఇస్తోంది. ఈ నూతన బ్రాండ్ ఐడెంటిటీ పంజాబ్ ప్రాంత ప్రజల యాస, భాషలను ఇనుమడింప చేస్తుందని మేనేజ్మెంట్ విశ్వసిస్తోంది.
పంజాబ్ కింగ్స్ ప్రమోటర్స్ మాట్లాడుతూ.. మేము జట్టు కంటే ఎక్కువగా ఓ కుటుంబంలా ఉంటామన్నారు. నిత్యం శ్రమిస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటామని చెప్పారు.
ఈ కొత్త లోగో, కొత్త పేరు తమకు నూతనోత్సాహాన్ని ఇచ్చాయని.. ఎన్ని ఒడుదుడుకులనైనా ఎదుర్కొని పోరాడాలన్న స్ఫూర్తిని తమలో నింపాయని ఆయన ఆన్నారు.
సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ జట్టు తన ప్రతిష్టను ఇనుమడింప చేసుకుందని.. దానిని మరింత పెంచేందుకు ఇదే సరైన సమయమని అన్నారు.
బ్రాండ్ ఐడెంటిటీని మార్చడమంటే తమ ప్రవృత్తిని మార్చుకోవడం కాదని, తామంతా ఎప్పటికీ ఓ కుటుంబంలా జీవించడమే అని చెప్పారు.
ఐపీఎల్ లోని 8 ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు (పాత పేరు కింగ్స్ లెవెన్ పంజాబ్) బడా వ్యాపారవేత్తలైన నెస్ వాడియా, మోహిత్ బర్మన్, ప్రీతి జింటా, కరణ్ పాల్ ఈ జట్టుకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు మూడుసార్లు తన పోరాట పటిమను ప్రదర్శించి పంజాబీయులు గర్వించేలా తన ఆటను ప్రదర్శించింది.
ఓటమిని అంగీకరించని ఈ జట్టు సభ్యులు పంజీబీగా జీవించు.. పంజాబీలా ఆడు అన్న ఉద్దేశంతో అందరి చూపును ఆకర్షిస్తున్నారు.
క్రీడా స్ఫూర్తితో ఆడే ఈ జట్టు మైదానంలో అందరిని అలరిస్తోంది. అంతేకాకుండా జట్టులో ఎలాంటి విబేధాలకు తావివ్వకుండా ఔత్సాహిక యువకులకు ఒక మంచి వేదికగా నిలుస్తోంది.