కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి!

156
Disagreement at KCR birthday celebrations!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం పలువురు నేత‌లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతున్నారు. వరంగల్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

కరీమాబాద్‌లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్‌లో పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది. ఆ మంటలు పేపర్లకు అంటుకొన్నాయి. వెంటనే నేతలు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు.

సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.