అనిరుధ్ తో ప్రేమాయణం… క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తల్లిదండ్రులు

276
Keerthy Suresh to tie the knot with music composer Anirudh Ravichander?

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కీర్తి గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తోందని…

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారి సమక్షంలోనే అనిరుధ్, కీర్తి పెళ్ళికి సిద్ధమవుతున్నారని మీడియా కోడై కూస్తోంది.

అక్టోబర్ 17న అనిరుధ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫొటోలను ఆధారంగా చేసుకుని ఈ రిలేషన్‌షిప్ వార్తలు వచ్చాయి.

అయితే ఈ రూమర్లపై కీర్తి సురేష్ తల్లిదండ్రులు సురేష్ కుమార్, మేనక స్పందించారు.

తమ కూతురు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేదని, ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టారని కీర్తి తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

‘మహానటి’తో జాతీయ అవార్డు సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో పాటు ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’, ‘అన్నాత్తే’ సినిమాల్లో నటిస్తున్నారు.

మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు సమాచారం.