అజహరుద్దీన్ తో కలిసి హరీశ్ రావు బ్యాటింగ్

174
Harish Rao Bating with Azharuddin

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు క్రికెట్ పై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే.

తన నియోజకవర్గం పరిధిలో అనేక క్రికెట్ టోర్నీలను ఆయన ప్రారంభిస్తారు. పోటీలను ప్రారంభించే సమయంలో ఆయన కూడా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తారు.

తాజాగా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తో కలిసి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు.

సిద్ధిపేటలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా అజహరుద్దీన్ విచ్చేశారు.

ఈ సందర్భంగా అజర్ ఓ ఎండ్ లో బ్యాటింగ్ చేయగా, హరీశ్ రావు మరో ఎండ్ లో బ్యాటింగ్ చేశారు.

అంతేకాదు, తన బౌలింగ్ పాటవాన్ని కూడా హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు.

దీనికి సంబంధించిన ఫొటోలను హరీశ్ రావు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలకు అనూహ్య స్పందన లభిస్తోంది.