రజినీ కి కర్ణాటక షాక్

376
karnataka not releasing rajini movie kala

కావేరీ నది జలాల వివాదంపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రజినీకాంత్ కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది . రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ తాజాగా నటించిన ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయరాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇప్పటికే ట్రైలరు విడుదలైన ‘కాలా’ చిత్రం జూన్ 7వతేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. కావేరీ నదీ జలాల వివాదంపై రజినీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన నటించిన ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకుండా చూడాలని కన్నడ సంఘాలు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో తాము ‘కాలా’ చిత్రాన్ని విడదల చేయకుండా నిషేధం విధించామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ చెప్పారు. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చించి ‘కాలా’ను విడుదల చేయరాదని నిర్ణయించినట్లు గోవింద్ వివరించారు.