కన్నడ సీనియర్ నటుడు కాశీనాథ్ కన్నుమూత

1495
kannada-film-actor-kashinath-passes-away

కన్నడ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత కాశీనాథ్ గురువారం ఉదయం కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాశీనాథ్ రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని శంకర కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. 40 పైగా సినిమాల్లో నటించిన కాశీనాథ్, 13 చిత్రాలను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ పనిచేశారు. కాశీనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు అభిమన్యు ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.కాశీనాథ్ తెలుగు చిత్రసీమకు సుపరిచితులే. ద్వంద అర్థాల డైలాగులతో తీసిన ‘పెద్దల’ సినిమాలతో కాశీనాథ్ ఫేమస్ అయ్యారు. కాశీనాథ్ చివరగా ‘చౌక’ సినిమాలో నటించారు. ప్రముఖ కన్నడ నటులు ఉపేంద్ర, వి.మనోహర్ తదితరులను ఆయన సినీ రంగానికి పరిచయం చేశారు. ఆయన నటించిన.. అనుభవం, వింత శోభనం, పొగరుబోతు పెళ్లం, సుందరాంగుడు వంటి అడల్డ్ కామెడీ సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాశీనాథ్ మరణానికి కన్నడ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.

 

kannada film actor kashinath passes away

Kannada senior actor, director and producer Kashinath passed away Thursday early morning. Kashinath, who was suffering from cancer, after two days of severe illness he was admitted to Sankara cancer hospital in Bangalore.He has acted in over 40 films and has produced and directed 13 films. He also worked as a music director for some films in Kannada. Kashinath has a wife and two children. Son of Abhimanyu is currently playing roles in Kannada films.

Kashinath is familiar with the Telugu film industry also. Kashinath fame with ‘adult’ films made with dual meanings dialogues. Kashinath finally appeared in the movie’Chowka’ .He was introduced to the industry by leading Kannada actors Upendra, V. Manohar and others. Many movies like Sundarankudu,anubhavam,pogarubothu pellam,vintha shobanam any many morecreated sensation in the film industry. Kannada film mourning for the death of Kashinath.