కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం 2’ ట్రైలర్: చాలా థ్రిల్లింగ్

475
kamal-hasan-vishwaroopam-2-trailer-released

ఉళగనాయగన్‌(లోకనాయకుడు) కమల్‌ హాసన్‌ తదుపరి చిత్రం విశ్వరూపం-2 చిత్ర విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈచిత్రం విడుదల కానున్నట్లు కమల్‌​ ఈ ఉదయం తెలిపారు.



 

వివాదాల నడుమ విడుదలైన మొదటి పార్ట్‌కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్‌ రాజకీయ ఆరంగ్రేటం నేపథ్యంలో విశ్వరూపం-2 చిత్రం విడుదల అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కమల్‌ హాసన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్‌, ఆండ్రియా హీరోయిన్లు కాగా, రాహుల్ బోస్, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం యూఎస్‌లో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌ని కంప్లీట్ చేసుకుని ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘విశ్వరూపం 2’.

తమిళ్‌, హిందీలో ఏకకాలంలో చిత్రం రూపొందించగా, తెలుగులో డబ్‌ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్‌, తమిళ ట్రైలర్‌ను కమల్‌ తనయ శృతిహాసన్‌, హిందీ ట్రైలర్‌ను అమీర్‌ ఖాన్‌ విడుదల చేస్తారు.

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం 2’ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందంటూ ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.



 

కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం 2’ ట్రైలర్: చాలా థ్రిల్లింగ్