శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ విడుదల

640
jhanvi-kapoors-dhadak-trailer-released

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ధడక్ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్లోనే స్టన్నింగ్ లుక్స్‌తో జాన్వీ అదరగొట్టేసింది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. నీకోసం ఏదో ఒక రోజు పెద్ద కోట కట్టిస్తా అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో ఇషాన్ ఖట్టర్‌కు ఇది రెండో సినిమా మాత్రమే. అతను ఇండోఇరానియన్ డైరెక్టర్ మాజిద్ మజిది బియాంగ్ ద క్లౌడ్స్ మూవీతో తెరంగేట్రం చేశాడు. నేషనల్ అవార్డు గెలిచిన సూపర్ హిట్ మరాఠీ మూవీ సైరత్‌కు ధడక్ రీమేక్ కావడం విశేషం. ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ విడుదల

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ విడుదల