ర‌ణ‌రంగం, కోమ‌లి చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్న కాజ‌ల్‌

223

కాజ‌ల్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోల‌తో న‌టిస్తూనే మ‌రోవైపు కుర్ర హీరోల‌తో జ‌త క‌డుతుంది. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో కాజ‌ల్ బిజీగా ఉంది. ఆమె న‌టించిన ర‌ణ‌రంగం, కోమ‌లి చిత్రాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ర‌ణ‌రంగం చిత్రం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు శ‌ర్వానంద్‌. చిత్రంలో కాజ‌ల్‌తో పాటు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాక‌పోవ‌డంతో ఆగ‌స్ట్ 15న రిలీజ్‌కి సిద్ధ‌మైంది.

ఇక జ‌యం ర‌వి, కాజ‌ల్, సంయుక్త హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం కోమ‌లి ఈ మూవీ కూడా ఆగ‌స్ట్ 15న విడుద‌ల అవుతుంది. ప్ర‌దీప్ రంగ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే రోజు కాజ‌ల్ రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కులకి మంచి వినోదం అందిస్తుంది. మ‌రి ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయో చూడాలి.