ఓంకార్‌ మరో సినిమా … తమన్నా ప్లేస్‌లో అవికా గోర్

240
raju gari gadi3

బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్‌  రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్‌ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు.

ఇటీవల తన తమ్ముడు అశ్విన్‌ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్‌. హారర్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఓ బాలీవుడ్‌ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే తమన్నా లాంటి గ్లామరస్‌ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారట. అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే. మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.