ఎన్టీఆర్ ఐపీఎల్ యాడ్ చూద్దామా?

645
junior ntr ipl promo in telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ నెట్‌వర్క్ తెలుగులో ఓ యాడ్‌ను విడుదల చేసింది. స్టార్ మా ఆధ్వర్యంలో తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో విశేషాదరణ కలిగిన ఎన్టీఆర్‌తో తెలుగులో ఐపీఎల్‌ను ప్రమోట్ చేయడానికి ప్రోమోలు కూడా షూట్ చేసింది.
 

తాజాగా స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ ఖాతా ద్వారా ఎన్టీఆర్ నటించిన ప్రోమోను విడుదల చేసింది. ఎన్టీఆర్ కొత్త లుక్‌లో సింపుల్‌గా డైలాగ్స్ చెప్పారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన సహాయ నటులు ఉన్నారు. అసలు మజా … తెలుగు రా .. అని తార‌క్ చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పదకొండో సీజన్‌లో ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను స్టార్ సంస్థ నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే.

ఐపీఎల్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ఏప్రిల్ 7న నిర్వహించనున్నారు. వేడుకల అనంతరం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.