భాగ్యనగరంలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న శిల్పారామం ప్రవేశరుసుం పెంచారు. దీంతో సందర్శకులకు అదనంగా భారం పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌కు తలమానికంగా ఉండే శిల్పారామంలో కార్యక్రమాలు వీక్షించడానికి నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు తరలివస్తుంటారు. గతంలో చిన్నారులకు రూ.20, పెద్దలకు నూ.40 ఉండగా, ప్రస్తుతం పెద్దల టికెట్ ధరను రూ.50 పెంచారు.